మధిర, వెలుగు : మున్సిపల్ ఎన్నికల వేళ పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి షాకిచ్చి కాంగ్రెస్ లోకి చేరారు. మధిర మున్సిపాలిటీలోని మడుపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ రేగళ్ల సాంబశివరావు, మాజీ కౌన్సిలర్ తొగరు వరలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు సోమవారం డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. కాంగ్రెస్లో చేరినవారిలో బీఆర్ఎస్ నాయకులుతోగరు ఓంకార్, పారుపల్లి వీరభద్రరావు, తలారి శేఖర్ బాబు, పంబి సాంబశివరావు, నీలం అప్పారావు, మేడికొండ ఆంథోనీ, పగడాల వెంకటేశ్వరరావు, వేల్పుల మంగయ్య తదితరులు ఉన్నారు.
