ఎంపీగా పోటీ చేయడం లేదు.. దానం క్లారిటీ

ఎంపీగా పోటీ చేయడం లేదు.. దానం క్లారిటీ

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా తాను  పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని అని అన్నారు.  ఖైరతాబాద్‌ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు. కాగా ఇటీవల దానం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని, ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దానం క్లారిటీ ఇచ్చారు.  

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.  1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగారు.  

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుండి పోటీచేసి  చింతల రామచంద్ర రెడ్డిపై ఓడిపోయాడు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి చింతల రామచంద్ర రెడ్డిపై గెలుపొందారు.