తెలంగాణ కళాకారులకు కేటీఆర్ ​అభినందన

తెలంగాణ కళాకారులకు కేటీఆర్ ​అభినందన

హైదరాబాద్, వెలుగు: జియోగ్రాఫికల్​ఇండికేషన్ (జీఐ) గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్ ను టీషర్టుల పైన వేసిన తెలంగాణ కళాకారులను బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​అభినందించారు. కళాకారులు రాకేశ్, వినయ్​శనివారం తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాము పెయింటింగ్​వేసిన టీ షర్ట్​లను కేటీఆర్​కు అందజేయగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడారు.

ఇలాంటి వినూత్న పద్ధతులతో సంప్రదాయ కళలకు ఎక్కువ డిమాండ్​వస్తుందని కేటీఆర్​అన్నారు. వీటికి బ్రాండింగ్ ​చేసి ఆన్​లైన్​లో మార్కెటింగ్​సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కల్వకుంట్ల సంజయ్, తెల్లం వెంకట్రావు, దాసోజు శ్రవణ్​ పాల్గొన్నారు.