రేవంత్ది అజ్ఞానమా? అహంకారమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

రేవంత్ది అజ్ఞానమా? అహంకారమా? : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి కనీస రాజ్యాంగ స్ఫూర్తి, అవగాహన లేదని, ట్రాఫిక్​ చలాన్ల సొమ్ము నేరుగా పోలీస్​వాళ్ల అకౌంట్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పడమేంటని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​అన్నారు. రేవంత్​ది అజ్ఞానమా? అహంకారమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 

ఈ మేరకు మంగళవారం తెలంగాణభవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. గ్రూప్–1 పరీక్షలను అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలి చేశారని ఆరోపించారు. చలాన్లు వేసేముందు రేవంత్​రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చాలని సూచించారు. సీఎం నోటి నుంచి ఒక్క పదం వచ్చినా దానికి చట్టబద్ధత ఉంటుందని, లేదంటే ప్రభుత్వం జోకర్​గా మిగిలిపోతుందన్నారు. రేవంత్​దేశానికి రాజు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.