హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం కోకాపేటలోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ఇదే కేసులో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కులంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ ఓఎస్డీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
