బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ప్రాపర్టీలు అమ్మకానికి!

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ప్రాపర్టీలు అమ్మకానికి!

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్ రియల్‌ ఎస్టేట్ ఆస్తులను  ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ ఆస్తులను అమ్మి రూ. 1,100
కోట్లను సేకరించాలని చూస్తోంది.  డిపార్ట్​మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్​మెంట్‌ అండ్ పబ్లిక్ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపం) వెబ్‌సైట్‌లో ఏయే ఆస్తులను విక్రయిస్తారో లిస్ట్
చేసి ఉంది. హైదరాబాద్‌, ఛండిగడ్‌, బావ్‌నగర్‌‌, కోల్‌కతా  సిటీలలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రాపర్టీలను  రూ. 800 కోట్ల (రిజర్వ్ ప్రైస్‌) కు  సేల్ చేయనున్నారు.
వాసరి హిల్‌, గోరెగాన్‌ (ముంబై) లలోని ఎంటీఎన్‌ఎల్ ఆస్తులను రూ. 270 కోట్ల (రిజర్వ్ ప్రైస్‌) కు విక్రయిస్తారు. కంపెనీ అసెట్ మోనిటైజేషన్ ప్లాన్  కింద
ఎంటీఎన్‌ఎల్‌కు ఓషివారాలోని 20 అంతస్తుల ఫ్లాట్‌ను కూడా అమ్మకానికి పెట్టింది. ఈ ఫ్లాట్‌ను కిందటేడాది డిసెంబర్ 14 న    ఈ–ఆక్షన్‌ కింద సేల్‌కు
పెట్టారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు రివైవల్ స్కీమ్ కింద రూ. 69 వేల కోట్లు ఇవ్వాలని 2019, అక్టోబర్‌‌లో ప్రభుత్వం నిర్ణయించింది.