అర్థరాత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే దీక్ష

అర్థరాత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే దీక్ష

బీఎస్పీ రాష్ట్రఅధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు ఆగస్టు 11 అర్థరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 12న గన్ పార్క్ దగ్గర  సత్యాగ్రహ దీక్ష చేస్తానని ప్రకటించారు.  ఈ క్రమంలో  అర్థరాత్రి ప్రవీణ్ కుమార్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయనను  హౌస్ అరెస్ట్ చేశారు.  పార్టీ నాయకులను, కార్యకర్తలను లోపలికి అనుమతించడం లేదు. 

అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లోనే దీక్షను కొనసాగిస్తున్నారు. తెలంగాణ  గడ్డ కేసీఆర్ లాంటి నియంతలను ఎంతో మందిని చూసిందన్నారు.  ఈ తాటాకుల చప్పుళ్లకు భయపడేది లేదని  గ్రూప్ 2 వాయిదా వేసే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు.   మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడిచిన పాలకులందరూ చరిత్రలో మట్టికరిచిపోయారని మండిపడ్డారు.