బ్లాక్ మెయిల్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ అరెస్ట్

బ్లాక్ మెయిల్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ అరెస్ట్
గూగుల్ అకౌంట్ల నుంచి పర్సనల్ డేటా సేకరించి.. బ్లాక్ మెయిల్ బీటెక్ స్టూడెంట్ అరెస్ట్ ఎల్ బీ నగర్,వెలుగు: లోకంటో డాట్ కామ్ నుంచి ఇతరుల ఫోన్ నంబర్లు సేకరించి తర్వాత వారి గూగుల్ అకౌంట్ల నుంచి పర్సనల్ డేటా తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ ను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పల్లెర్లకు చెందిన ఆరెసాని భరత్ కుమార్(21) ఘట్ కేసర్ లో ఉంటూ శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనతో లోకంటో డాట్ కమ్ వెబ్ సైట్ నుంచి ఇతరుల నంబర్లు సేకరించేవాడు. ఆ నంబర్లను గూగుల్ లో టైప్ చేసేవాడు. ఎవరిదైనా మెయిల్ ఐడీ వచ్చి దానికి అదే మొబైల్ నంబర్ పాస్ వర్డ్ గా ఉంటే వాటిని ఓపెన్ చేసేవాడు.  మెయిల్ ఐడీ నుంచి గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ లోకి వెళ్లి వారి పర్సనల్ ఇన్ ఫర్మేషన్, ఫొటోలను సేకరించేవాడు. తర్వాత  ‘సెకండ్ లైన్’ యాప్ ను డౌన్ లోడ్ చేసి ఇతర దేశాలకు సంబంధించిన నంబర్ లాగా వాట్సాప్ క్రియేట్ చేసుకునేవాడు. అందులో నుంచి తాను సేకరించిన ఫొటోలను బాధితుల వాట్సాప్ కి పెట్టి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. డబ్బులు అకౌంట్ లో వేయకపోతే పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబీకులు, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తానని బెదిరించేవాడు. సిటీకి చెందిన ఓ బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు భరత్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.