మద్యం కోసం సీనియర్ల టార్చర్.. సెల్ఫీ వీడియో తీసుకుని బీటెక్ యువకుడు సూసైడ్

మద్యం కోసం సీనియర్ల టార్చర్.. సెల్ఫీ వీడియో తీసుకుని బీటెక్ యువకుడు సూసైడ్

మేడిపల్లి, వెలుగు: సీనియర్స్ ర్యాగింగ్‎కు ఓ బీటెక్ విద్యార్థి బలయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‎కు చెందిన జాదవ్ సాయితేజ నారపల్లిలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్​ చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్‎లోనే ఉంటున్నాడు. ఆయనపై సీనియర్ స్టూడెంట్స్​ ర్యాగింగ్ చేయడంతో పాటు మానసిక ఒత్తిడికి గురిచేశారు. మద్యం తాగించాలని బార్‎కి తీసుకువెళ్లారని, మద్యం తాగాక బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని సాయితేజ సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపాడు. 

అంతేగాకుండా ఆయనపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. సీనియర్స్​వేధింపులు తట్టుకోలేక ఆదివారం రాత్రి హాస్టల్‎లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాడి సమయంలో సీనియర్స్‎తో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో  కేసు విషయమై పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ సోమవారం మృతుడి బంధువులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు చేశారు. డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవిందరెడ్డి తెలిపారు.