కేంద్ర బడ్జెట్ 2020: కాస్ట్ పెరిగే వస్తువులేవి? తగ్గే వస్తువులేవి?

కేంద్ర బడ్జెట్ 2020: కాస్ట్ పెరిగే వస్తువులేవి? తగ్గే వస్తువులేవి?

రూ.30.42 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఆదాయ పన్ను శ్లాబ్‌లలో మార్పు తప్ప పెద్దగా సామాన్య జనం ఆశించిన మెరుపులేమీ బడ్జెట్‌లో లేవు. మార్కెట్, ఇన్వెస్టర్ల అంచనాలకు అనుగుణంగా కూడా లేదని షేర్ మార్కెట్ డౌన్ అయిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇక బడ్జెట్ వస్తే ఏ వస్తువులు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి? అన్న దానిపై అందరి ఆసక్తి ఉంటుంది. అవేంటో చూద్దాం.

పెరిగేటివి              

సిగరెట్లు, టొబాకో ఉత్పత్తులు, జర్దా, హుక్కాఇంపోర్ట్​ చేసుకునే వస్తువులు..

ఫుట్​ వేర్, ఫర్నీచర్, కిచెన్​వేర్, ఫ్యాన్లు, ఆటో పార్ట్స్​, ఎలక్ట్రిక్​ వెహికల్స్, కెమికల్స్, ఎడిబుల్​ ఆయిల్స్, బొమ్మలు, చూయింగ్​గమ్, వాల్​నట్స్, షేవర్లు, హెయిర్​ క్లిప్పర్స్, హెయిర్​ రిమూవింగ్​ ప్రొడక్ట్స్, వాటర్​ ఫిల్టర్స్, జెమ్​స్టోన్స్, వాటర్ హీటర్స్, ఇమ్మర్షన్​ హీటర్స్, హెయిర్​ డ్రయర్స్, ఎలక్ట్రిక్​ ఐరన్​ బాక్స్, వెట్​ గ్రైండర్స్, ఒవెన్స్, కుక్కర్స్, కాఫీ, టీ మేకర్స్, స్టేషనరీ ఐటమ్స్, ఆర్టిఫీషియల్​ ఫ్లవర్స్, సెల్​ఫోన్లలో వాడే ఫింగర్​ప్రింట్​ రీడర్లు, మొబైల్​ ఫోన్లలో వాడే పీసీబీఏలు, మొబైల్​ ఫోన్ల టచ్, డిస్​ప్లే ప్యానెల్స్, మెడికల్​ సంబంధిత వస్తువులు.

తగ్గేటివి

దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఈ కింది వాటి ధరలు తగ్గుతాయి.

లైట్​వెయిట్ కోటెడ్​ పేపర్

ఇంపోర్టెడ్​ న్యూస్​ప్రింట్

ఫ్యూస్, కెమికల్స్, ప్లాస్టిక్స్​

ముడి చక్కెర

ఆగ్రో–యానిమల్

బేస్డ్​ ప్రొడక్ట్స్

స్కిమ్డ్​ మిల్క్​

కొన్ని ఆల్కహాలిక్​ డ్రింక్స్

స్పోర్ట్స్​ వస్తువులు

మైక్రోఫోన్లు

ఎలక్ట్రిక్​ వెహికల్స్ (దేశంలో ఉత్పత్తి అయ్యేవి మాత్రమే