హైదరాబాద్ సిటీ, వెలుగు: గత 20 రోజుల్లో ఎంఎంసీ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న 172 పశువులను పట్టుకున్న పోలీసులు వెటర్నరీ అధికారులకు అప్పగించారు. తర్వాత పశువుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
మాదన్నపేట, నాగోల్, సంతోష్‌నగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేయగా, అక్రమంగా తరలిస్తున్న పశువులు కనిపించాయి. స్వాధీనం చేసుకున్న పశువుల్లో 13 గోశాలలకు, 103 పశువులను ఫతుల్లాగూడలోని ఎంఎంసీ పశువుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
3 ఆవులు, 52 ఎద్దులు, 15 బర్రెలు, 33 దున్నపోతులు ఉన్నాయి. పశువుల సంరక్షణ కేంద్రానికి తరలించిన పశువుల ఆరోగ్య పరిస్ధితిని వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అస్వస్థతకు గురైన వాటికి వెటర్నరీ ఆఫీసర్ సంజీవ్ రెడ్డి ట్రీట్మెంట్ఇచ్చారు. అలాగే వాటిని సిబ్బంది సాయంతో అబ్జర్వేషన్ లో ఉంచారు.
