
నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. జలప్రళయానికి గుళ్లు సైతం నీట మునిగాయి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలోని వరద నీరుచేరింది. అమ్మవారి విగ్రహం సగం వరకు నీటిలోనే మునిగింది. పూజారులు ఆ నీటిలోనే ఉండి పూజలు నిర్వహిస్తున్నారు.
For More News..