ఇక ఫుడ్​లో టమాటాలు వాడలేం.. చేతులెత్తేసిన బడా రెస్టారెంట్​

ఇక ఫుడ్​లో టమాటాలు వాడలేం.. చేతులెత్తేసిన బడా రెస్టారెంట్​

టమాటా ధరల పెరుగుదలతో ఇటీవల మెక్​డొనాల్డ్స్, సబ్​వే తమ ఫుడ్ లో టమాటాలకు గుడ్​ బై చెబుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా మరో బడా కంపెనీ అదే దారిలో నడుస్తోంది.  

‘టమాటాలకు కూడా వెకేషన్‌ అవసరం. ప్రస్తుతం వీటితో కలిపిన ఆహారాన్ని కస్టమర్లకు అందించలేం’ అని బర్గర్‌ కింగ్‌ ఇండియా ఔట్‌లెట్స్‌ సోషల్‌మీడియాలో సందేశాల్ని పోస్ట్‌ చేసినట్టు రాయిటర్స్‌  వార్తా కథనం పేర్కొంది. టమాటా, జున్ను ముక్కలు లేకుండా బర్గర్స్‌ తదితర  ఫుడ్‌ ఐటెమ్స్‌ను సరఫరా చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.  

అయితే ధరలు తగ్గాక త్వరలో మళ్లీ టమాటాలను ఫుడ్​లో చేర్చనున్నట్లు యాజమాన్యం తెలిపింది.