శ్రీశైలం ఘాట్​ రోడ్​లో  బస్సు బోల్తా.. 20 మందికి  గాయాలు

శ్రీశైలం ఘాట్​ రోడ్​లో  బస్సు బోల్తా.. 20 మందికి  గాయాలు

శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు కాగా.. పదిమందికి కాళ్లు,చేతులు విరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు..దీంతో గాయపడిన వారిని వెంటనే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్తగూడెం నుంచి శ్రీశైలం బస్సు వెళుతుండగా  శ్రీశైలం - దోర్నాల నల్లమల ఘాట్ రోడ్లోని చిన్నారుట్ల సమీపంలోని దయ్యాల టర్నింగ్ వద్ద  ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది

కాగా ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అందుకున్న108 సిబ్బంది గాయపడిన వారిని శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  శ్రీశైలం ఘాట్ రోడ్డులోని సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణం

బస్సు డ్రైవర్ మలుపులను అంచనా వేయకుండా అతి వేగంగా రావడమే బస్సు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.. . ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలోను చాలాసార్లు ప్రమాదాలు జరిగినా.. అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశం రెండు అడుగుల దూరంలో భారీ... సుమారు 100 అడుగుల లోయ ఉంది.. అందులో పడి ఉండి ఉంటే.. బస్సులోని ప్రయాణికులు ఎవ్వరూ బతికేవారు కాదని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, డివైడర్ ను ఢీ కొట్టి సేఫ్టీ వాల్ ను తగిలి బస్సు బోల్తా పడి ఆగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇక, ప్రమాదం జరిగిన విషయం తెలిసి హుటాహుటిన దేవస్థానం ఏఈవో ఫణిదారు ప్రసాద్, శ్రీశైలం సీఐ, ఎస్ఐ సిబ్బందితో అంబులెన్సులు వేసుకొచ్చి క్షతగాత్రులను శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి.. మరికొందరిని నుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.