భూతాల బంగ్లాలో ఫన్ రైడ్

భూతాల బంగ్లాలో ఫన్ రైడ్

కమెడియన్‌‌గా ప్రేక్షకులను మెప్పించిన సంతానం.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల తను నటించిన ‘డీడీ రిటర్న్స్’ తమిళంలో సూపర్ హిట్ సాధించింది. తెలుగులోనూ సంతానంకి  పాపులారిటీ ఉండటంతో..  ఈ చిత్రాన్ని  సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌పై నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్.వి ప్రసాద్ ఆగస్టు 18న  ‘భూతాల బంగ్లా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌‌లో ప్రెస్‌‌మీట్‌‌ నిర్వహించారు.  

సంతానం మాట్లాడుతూ ‘ఈ సినిమా తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. సక్సెస్ ఫుల్‌‌గా రన్ అవుతోంది. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూశాను. ఈ చిత్రం ద్వారా తెలుగులోకి రావడం ఆనందంగా ఉంది.  

ఒక  రోలర్ కోస్టర్ ఫన్ రైడ్‌‌లా సినిమా ఉంటుంది. హారర్ కామెడీ విత్ గేమ్‌‌తో ఉన్న ఈ చిత్రాన్ని పిల్లలు దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరూ  ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  తెలుగులో రిలీజ్ అవడం ఎక్సయిటింగ్‌‌గా ఉందని చెప్పింది హీరోయిన్ సురభి. ‘డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీనే తమిళంలో హిట్ అవడం, వెంటనే తెలుగులో రిలీజ్ అవడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు చిత్ర దర్శకుడు ప్రేమ్ ఆనంద్.  ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, వాకాడ అప్పారావు చెప్పారు.