బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తే.. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోతది: మమత

బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తే.. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోతది: మమత

కోల్‎కతా: బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తే.. కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని కోల్పోతుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అన్ని యాంటీ -బీజేపీ పార్టీలను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాణిగంజ్, పురూలియా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆమె బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లతో అందరినీ బయటకు పంపేస్తారని, బెంగాల్ రాష్ట్ర హోదాను కూడా రద్దు చేస్తారని ఆమె ఆరోపించారు. ప్రజలు ఏమి తినాలి, ఏమి ధరించాలి అనేది కూడా బీజేపీనే శాసించాలని చూస్తోందని, మీకు స్వేచ్ఛ కావాలంటే టీఎంసీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 
ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని మమతా ఆరోపించారు. సర్​పేరుతో దాదాపు 1.20 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆమె పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారిని ఎన్​ఆర్​సీ పేరుతో డిటెన్షన్ క్యాంపులకు పంపే కుట్ర జరుగుతోందని.. కానీ, తాను అది జరగనివ్వనని స్పష్టం చేశారు.