కోరుట్ల, వెలుగు : బైక్ అదుపుతప్పి కెనాల్‌లో పడడంతో యువతీయువకుడు గల్లంతయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పెద్దాపూర్ గ్రామ సమీపంలోని కాల్వ నీటిలో బైక్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు ఘటనాస్థలానికి చేరుకొని బైక్‌ను బయటకు తీశారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆరా తీయగా.. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన బొదాసు లావణ్య, మెట్‌పల్లికి చెందిన అంకుశ్ కలిసి బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు.
లావణ్య బైక్ నడుపుతుండగా అంకుశ్ వెనుక కూర్చున్నట్లు తెలిసింది. యువతి బైక్ నడుపుతూ కాల్వ వద్దకు రాగానే అదుపుతప్పి నీటిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. కాల్వలో గల్లంతయిన లావణ్య, అంకుశ్ కోసం గాలిస్తున్నట్లు కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు.
