చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్.. ఘట్ కేసర్ ఎదులాబాద్ చెరువు నుంచి వస్తుండగా ఘటన

చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్.. ఘట్ కేసర్ ఎదులాబాద్ చెరువు నుంచి వస్తుండగా ఘటన

ఘట్​కేసర్, వెలుగు: బైక్​అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరుకు చెందిన డొప్ప క్రాంతికుమార్ (20), లక్కారానికి చెందిన కట్ల ఆడమ్ (21)శనివారం ఘట్​కేసర్​పరిధిలోని పిలాయిపల్లిలో జరిగిన తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎదులాబాద్ చెరువును చూసి వద్దామని రాత్రి డ్యూక్ బైక్​పై వెళ్లారు. తిరిగి వస్తుండగా భవానీ ఫంక్షన్ హాల్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో క్రాంతికుమార్ మృతి చెందగా, ఆడమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.