బస్సును ఓవర్ టేక్ చేయబోయి బైకర్ మృతి.. ప్రగతినగర్ చెరువు దగ్గర ఘటన

బస్సును ఓవర్ టేక్ చేయబోయి బైకర్ మృతి.. ప్రగతినగర్ చెరువు దగ్గర ఘటన

కూకట్​పల్లి, వెలుగు: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. శంషీగూడలో నివసించే దేవరకొండ కిషోర్​(30) ఫ్రూట్స్​ వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం ఉదయం బైక్​ పై ప్రగతినగర్​కు వెళ్తున్నాడు. ప్రగతినగర్​ చెరువు వద్ద ముందు వెళుతున్న బస్సును ఓవర్​టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బస్సు టైర్​ కింద పడ్డాడు. తీవ్రగాయాలతో స్పాట్​లో చనిపోయాడు.