సాప్ట్ వేర్ ఇంజనీర్ అమ్మాయిని వేధించిన క్యాబ్ డ్రైవర్

సాప్ట్ వేర్ ఇంజనీర్ అమ్మాయిని వేధించిన క్యాబ్ డ్రైవర్

హైద‌రాబాద్: సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఓ యువతిని క్యాబ్ డ్రైవర్ వేధించిన ఘటన హైద‌రాబాద్ లో జ‌రిగింది. తన కారు కోసం డ్రైవర్ కావాలని ఓఎల్ఎక్స్ లో ఓ యాడ్ పెట్టింది ఆ యువతి. ముస్తఫా అనే డ్రైవర్ కాల్ చేసే టైంకి మరో డ్రైవర్ ని అపాయింట్ చేసుకుంది. దీంతో డ్రైవర్ ఉద్యోగం దక్కలేదన్న కోపంతో ఆ అమ్మాయికి ఫోన్ చేస్తూ వేధించాడు ముస్తఫా. ఆమెకు అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు పంపి వేధింపులకి పాల్పడడంతో ఆమె షి టీమ్ కు ఫిర్యాదు చేసింది. క్యాబ్ డ్రైవర్ ముస్తఫాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది షి టీమ్. ఇక మరో కేసులో జగద్గిరిగుట్టకు ల్యాబ్ టెక్నీషియన్ ను అరెస్టు చేశారు పోలీసులు. సహా ఉద్యోగిని వ్యక్తిగత ఫోటోలు కావాలంటూ ఓ యువతిని వేధించాడు శ్రీనివాస్ అనే ల్యాబ్ టెక్నీషియన్. సదరు యువతి ఫిర్యాదుతో శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.