రాష్ట్ర బంద్ కు క్యాబ్ డ్రైవర్ల మద్దతు… ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు బంద్

రాష్ట్ర బంద్ కు క్యాబ్ డ్రైవర్ల మద్దతు… ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు బంద్

ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర బంద్ పిలుపు ఇవ్వడంతో…  పట్నంలోని రోడ్లు ఖాలీగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు రాలేదు. దీంతో పాటు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటోలు బంద్ లో పాల్గొనటంతో రోడ్లపై  ఎక్కడా ట్రాఫిక్ కనిపించటం లేదు. క్యాబ్ డ్రైవర్ల బంద్ తో ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదారబాద్ లోని రోడ్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పొద్దున నుంచే ఆర్టీసీ బస్ డిపోలు, బస్టాండ్ల దగ్గర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్ష నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు నిరసనలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సంఘాల నాయకులు, రాజకీయ నేతలను ముందుస్తు అరెస్టు చేశారు పోలీసులు. మరికొన్ని చోట్ల  పోలీస్ వాహనాలతో ఎస్కార్టు పెట్టి మరీ బస్సులు నడిపిస్తున్నారు.

జిల్లాల్లోనూ పొద్దున్నే డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన, బైక్ ర్యాలీలు తీస్తున్నారు. బంద్ ను సంపూర్ణం చేయాలని కోరుతున్నారు.  డిపోల దగ్గర నిరసన తెలుపుతున్న పార్టీల నేతలను, కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.