అప్పులు, వడ్డీలపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం : కేటీఆర్‌‌‌‌‌‌‌‌

అప్పులు, వడ్డీలపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం : కేటీఆర్‌‌‌‌‌‌‌‌
  • కాకి లెక్కల డొల్లతనాన్ని కాగ్ బయటపెట్టింది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌
  • నెలకు రూ.2,300 కోట్లు కూడా లేని వడ్డీని 7 వేల కోట్లని అబద్ధాలు చెప్పారు 
  • రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: అప్పులు, వడ్డీలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నుంచి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చెబుతున్న కాకి లెక్కల డొల్లతనాన్ని కాగ్ బయటపెట్టిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

అక్టోబర్ నెల కోసం కాగ్ విడుదల చేసిన నివేదికలోని లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు వాటికి కడుతున్న వడ్డీలను తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నదని కేటీఆర్ తెలిపారు. ప్రతి నెలా రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ కాగ్ లెక్కల ప్రకారం రూ.2,361.41 కోట్లు మాత్రమే కడుతున్నట్లు వెల్లడించారు. 

పార్లమెంటు లెక్కల ప్రకారం పదేండ్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం రూ.2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తే, 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్ల అప్పును తీసుకొచ్చిందన్నారు. ఈ అప్పులన్నీ దేని కోసం చేశారో ప్రజలకు వివరించాలన్నారు. 

అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం పరిధి దాటి తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్ల అప్పులు ఏయే పథకాలకు, ఏయే ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వివరాలు విడుదల చేయాలన్నారు. అదేవిధంగా, గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలనూ ప్రజల ముందుంచాలన్నారు. 

29న దీక్షా దివస్ నిర్వహించండి..

ఈ నెల 29న 'దీక్షా దివస్'ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలో ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివస్‌‌‌‌‌‌‌‌ను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.