జీడిమెట్లలో న్యూస్ కవర్ చేస్తూ గుండెపోటుతో కెమెరామ్యాన్ మృతి

జీడిమెట్లలో  న్యూస్ కవర్ చేస్తూ గుండెపోటుతో కెమెరామ్యాన్ మృతి
  •     కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి

జీడిమెట్ల/పద్మారావునగర్, వెలుగు: జీడిమెట్లలో కేటీఆర్  పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. న్యూస్​కవరేజికి వచ్చిన ఆజ్​తక్​ టీవీ చానెల్  కెమెరామ్యాన్​ దామోదర్  గురువారం గుండెపోటుతో చనిపోయారు. న్యూస్​ కవరేజ్​ చేస్తుండగా గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు.  

దీంతో పోలీసులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. గాంధీ దవాఖానలో దామోదర్​ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన కేటీఆర్..​ దామోదర్  మృతదేహానికి  నివాళులర్పించారు.