భక్తులకు అలర్ట్.. కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

భక్తులకు అలర్ట్.. కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజుల పాటు జరగనున్న హనుమాన్ పెద్ద జయంతి వేడుకల్లో భాగంగా ఈనెల 20వ తారీఖు నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈఓ శ్రీకాంత్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా జరిగే జయంతి వేడుకల్లో భాగంగా భారీ సంఖ్యలో భక్తులు గుట్టకు చేరుకోనుండగా ఆర్జిత సేవలు బంద్ చేస్తున్నట్టు చెప్పారు.