- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
తొగుట (దుబ్బాక) వెలుగు: క్యాన్సర్ మహమ్మారిని మొదటి దశలోనే గుర్తించి, ట్రీట్‌మెంట్ తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోనీ 100 పడకల హాస్పిటల్‌లో తన కుమార్తె శిశిర హాస్పిటల్ సహకారంతో సుమారు రూ.కోటితో అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్క్రీనింగ్ క్యాన్సర్ పరీక్షల క్యాంప్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు మహిళలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీగా రెండేండ్లు పూర్తయిన సందర్భంగా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మహిళలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి మెరుగైన స్పందన వచ్చిందని, ప్రతి ఆదివారం అదనంగా మరో క్యాంప్ బస్సును మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలు, మేజర్ జీపీలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సంగీత, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు
పాల్గొన్నారు .
