కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలె

కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలె

డీజీపీ ఆఫీస్ ముట్టడికి అభ్యర్థుల ప్రయత్నం

హైదరాబాద్ : కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్ లోని డీజీపీ ఆఫీస్ ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో అక్కేడ ఉన్న పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకుని, రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2020లో వేయాల్సిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు ఆలస్యంగా వేయడంతో దరఖాస్తు చేసుకోలేక తాము తీవ్రంగా నష్టపోతున్నామని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ, మంత్రులను కలిసి తమ సమస్య గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఫైర్, జైళ్ల శాఖలోని కానిస్టేబుల్స్ పోస్టులకు గతంలో 35 ఏళ్ల వయోపరిమితి ఉంటే ఇప్పుడు 30 ఏళ్లకు కుదించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారంతో (ఈనెల 20వ తేదీ)కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు ముగియనుంది. 

ఉస్మానియా యూనివర్శిటీలోనూ  ఆందోళన
కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా నిర్వహించారు. 

మరిన్ని వార్తల కోసం..

సీఎం దత్తత గ్రామంలోనూ ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

దిశా ఎన్‌‌కౌంటర్‌‌పై సుప్రీంకోర్టు విచారణ.. ప్రకటనపై ఉత్కంఠ