రక్షణ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడం

రక్షణ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడం

బెంగళూరు: దేశ రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడబోమని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో రెండో ఎల్‌సీఏ (లైట్ కాంబాట్ ఎయిర్‌‌క్రాఫ్ట్)‌‌ ప్రొడక్షన్ లైన్‌‌‌‌ను రాజ్‌‌నాథ్ ప్రారంభించారు. హెచ్ఏఎల్‌‌కు కొత్త ఆర్డర్‌‌లు వచ్చేలా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోందని ఆయన చెప్పారు. ‘కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ రక్షణ బలగాల నుంచి హెచ్‌‌ఏఎల్‌‌కు రూ.48 వేల కోట్ల ఆర్డర్‌‌లు వచ్చాయి. భారత ఏయిరోస్పేస్ సెక్టార్‌‌ను కొత్త ఎత్తులకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. తేజస్ ఎం1ఏ కొనుగోలుకు పలు దేశాలు ఆసక్తిని చూపాయి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌‌లో భాగంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని పెంచడం మీద ఫోకస్ చేస్తున్నాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.