ఫేస్ మాస్క్ పెట్టు కుంటలేరు

ఫేస్ మాస్క్ పెట్టు కుంటలేరు

రాష్ట్ర వ్యాప్తంగా 16,264 కేసులు
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్య ధికంగా 3,892 కేసులు
హైదరాబాద్, వెలుగు: పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేసుల్లో మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టు కోకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. డిజాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్ మెంట్‌ యాక్ట్ కింద ఫైన్‌ వేస్తున్నారు. అయినా కూడా చాలా మంది మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టు కోకుండానే రోడ్డెక్కుతున్నారు. 13 రోజులుగా ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌ తో పాటు స్థానిక పోలీసులు మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేని వారిని గుర్తిస్తున్నారు.

మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వచ్చిన ఈ నెల 7 నుంచి 19వ తేదీ(మంగళవారం) వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,264 కేసులను రిజిస్టరయ్యాయి. మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా తిరుగుతున్న వారిపై డిజాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌ మెంట్‌ యాక్ట్ సెక్షన్‌ 51(బి ) కింద పెటీ కేసు పెడుతున్నారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 3,892 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కమిషనరేట్‌ పరిధిలో1846, రామగుం డం1472, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1105, సైబరాబాద్‌ లో 844 కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి.