రెండు ఓటములతో ఎన్నో పాఠాలు

 రెండు ఓటములతో ఎన్నో పాఠాలు

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌: ఆసియా కప్‌‌‌‌లో ఇండియా తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ  వచ్చే నెలలో మొదలయ్యే టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో పాల్గొనే టీమ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ దాదాపు సెటిల్‌‌‌‌ అయిందని కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ అన్నాడు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానం కొనుగొనాల్సి ఉందన్నాడు. ‘ ఆసియా కప్‌‌‌‌లో మేం ప్రయోగాలు చేశాం. స్టార్టింగ్‌‌‌‌లో నలుగురు పేసర్లు, ఇద్దర్లు స్పిన్నర్లతో ఆడాం. రెండో స్పిన్నర్‌‌‌‌గా ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దింపాం. నేను ప్రతీసారి ప్రయోగాలకు మొగ్గు చూపాను. ఒకవేళ మేం ముగ్గురు స్పిన్నర్లు, ఓ స్పెషలిస్ట్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌, మరో స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌తో ఆడితే ఫలితం ఎలా ఉంటుందో చూశాం.

ముఖ్యంగా హార్దిక్‌‌‌‌ గాయం నుంచి తిరిగొచ్చిన నేపథ్యంలో తను థర్డ్‌‌‌‌ సీమర్‌‌‌‌గా పనికొస్తాడో లేదో తెలుసుకోవాలనుకున్నాం. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే ఎలా ఉంటుందో గ్రహించాం. ఈ రెండు ఓటములు మాకు ఎన్నో పాఠాలు నేర్పాయి. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ 90-–95 శాతం సెటిలైంది. కేవలం కొన్ని మార్పులే జరగొచ్చు. టీమ్‌‌‌‌ విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.  రాబోయే మూడు, నాలుగు సిరీస్‌‌‌‌ల్లో వాటికి సమాధానం లభిస్తుందని అనుకుంటున్నా. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ డ్రా విడుదలయ్యే టైమ్‌‌‌‌కు మా కాంబినేషన్‌‌‌‌ రెడీగా ఉంటుందని భావిస్తున్నా’ అని రోహిత్‌‌‌‌ చెప్పుకొచ్చాడు.