తిరుమలలో కారు ప్రమాదం జరిగింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం తిరుమలలోని ఎస్వీ గెస్ట్ హౌస్ దగ్గర వేగంగా వచ్చిన కారు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారు హ్యాండిల్ స్ట్రక్ అవ్వడంతో అదుపుతప్పిన కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది.
అయితే, కారులో ముందు, సైడ్ బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మిడిల్ సీట్లో కూర్చున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో గాయపడ్డవారిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తులు చెన్నైకి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎస్వీ గెస్ట్ హౌస్ దగ్గర కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
