హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర తగలబడ్డ కారు..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర తగలబడ్డ కారు..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్  ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర కారు తగలబడింది. ఉప్పల్ నుంచి తార్నక వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.  కారులో ఉన్నవాళ్లు అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. కారు ప్రమాదంతో  ఉప్పల్ నుంచి తార్నాక వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.


ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే కారు పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు..కారు ఎవరిది ఏంటనేదానిపై ఆరాదీస్తున్నారు.