కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన కారు.. పంట చేనులో బోల్తా

కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన కారు.. పంట చేనులో బోల్తా

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లె గ్రామ శివారులో కుక్క అడ్డు రావడంతో కారు అదుపు తప్పి పంట చేనులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి ఘటనే.. రెండు నెలల క్రితం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రోడ్డుపై అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయి బైక్పై నుంచి పడి యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ పీఎస్​పరిధిలో జరిగింది.

ఎస్ఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం..  మండలంలోని జుల్కల్ గ్రామానికి చెందిన పట్నం ప్రవీణ్ (28) ఎద్దుమైలారం గ్రామం మీదుగా బంధువు పట్నం మల్లేశ్తో కలిసి బైక్​పై జుల్కల్ నుంచి శంకర్ పల్లి వైపు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి చెట్టును ఢీ కొట్టాడు. ప్రమాదంలో ప్రవీణ్‌ తల, ముఖానికి గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక కూర్చున్న మల్లేశ్ తలకు గాయాలు కావడంతో శంకరపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.