మేడిపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు ..12 మందికి తీవ్రగాయాలు..

మేడిపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు ..12 మందికి తీవ్రగాయాలు..

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్  వెళ్తున్న బస్సును మేడిపల్లి సమీపంలో కర్నాటక నుంచి కోరుట్ల వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 12 మందికి తీవ్రగాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. 

గాయపడిన వారిని జగిత్యాల, కరీంనగర్‌‌, నిజామాబాద్  హాస్పిటళ్లకు తరలించారు. గాయపడిన వారంతా కర్నాటకలోని గానుగాపూర్​ దత్తాత్రేయస్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. బస్  డ్రైవర్  సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్​  తెలిపారు.