V6 News

హైదరాబాద్ మీర్ పేటలో పల్టీలు కొట్టిన కారు..

హైదరాబాద్ మీర్ పేటలో  పల్టీలు కొట్టిన కారు..

హైదరాబాద్ లోని  మీర్ పేటలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో  కారునుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి

అసలేం జరిగిందంటే. డిసెంబర్ 10న  మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని  మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారి దగ్గర ధాతు నగర్ సమీపంలో అధిక వేగంతో వస్తున్న కారు ఆకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన మీర్ పేట పోలీసులు గాయాలైన  వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.