హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బొంగులూరు గేట్ దగ్గర జరిగిన ప్రమాదం మరువక ముందే మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. బొంగులూర్ ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే.. మే 11న ఉదయం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ సబ్ వైపై కారు బీభత్సం సృష్టించింది. సబ్ వేను ఢీకొట్టడం ఇతర వాహనదారులను భయాందోళనలకు గురిచేసింది.
కోకాపేట్ నుంచి వట్టినాగులపల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఘటన గురించి వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఔటర్ పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రత్యేక భద్రతా చర్యలపై ఫోకస్ చేస్తున్నారు. అతి వేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
