ఖమ్మం, వెలుగు: డీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా విజయవాడ కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఎస్ఆర్ మూర్తి హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు.
అనంతరం కాలేజ్ప్రిన్సిపాల్ టి.నాగేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ అనంతరం టెక్నాలజీ రంగాల్లో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల్లో డీఆర్ఎస్ కళాశాల నుంచి టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్‌పర్సన్ వి.శోభా రెడ్డి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వి.మోహన్ రెడ్డి, ఏవో వెంకటకృష్ణ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ పీజీ అడ్మిషన్స్ హెడ్ టి. కల్యాణ్ నారాయణ తదితరులున్నారు.
