విశాఖపట్నం: అమెరికన్ కంపెనీ క్యారియర్ గ్లోబల్ ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లను చల్లబరిచే కూలింగ్ సిస్టమ్స్‌ను తయారు చేయనుంది. ఇందు కోసం శ్రీ సిటీ (తిరుపతి) లో 39 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.863 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
సుమారు 721 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు ఇక్కడ ఏఐ డేటా హబ్‌లను నిర్మించేందుకు ముందుకొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూలింగ్ సిస్టమ్స్‌కు డిమాండ్ పెరగనుంది.
