
వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో స్పెషల్ బ్రాంచి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.. వల్భాపూర్‌లో సోమవారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ బ్రాంచికి చెందిన ఏఎస్‌ఐ బాపురెడ్డి ఫోటోలు, వీడియోలు తీశారు. ఫోటోలు తీస్తున్న వ్యక్తిని.. మీరెవరని ఈటల అనుచరులు ప్రశ్నించడంతో.. వారి మధ్య తోపులాట జరిగింది. దీంతో తనపై ఈటెల అనుచరులు దాడి చేశారంటూ వీణ వంక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు ఏఎస్‌ఐ బాపురెడ్డి. ఏఎస్ ఏఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు వీణవంక పోలీసులు.