కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసు

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: మధురానగర్​లో ఈ నెల 6న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో ఇరువర్గాలపై కేసు నమోదైంది. సాయిబాబా ఆలయం దగ్గర ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో పెట్రోలింగ్ సిబ్బంది చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. 

అదే రోజు కొద్దిసేపటి తర్వాత సీవరేజ్ పైప్​లైన్ పనుల ప్రారంభోత్సవ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోగా, బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు కూడా హాజరయ్యారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగి దాడులు జరిగాయి. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు, సత్యనారాయణ, ఇమ్రాన్, బబ్లు, కాంగ్రెస్ నేతలు రూప, సత్యం, నాగ, నర్సింగ్ యాదవ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.