హైదరాబాద్‌సిటీ, వెలుగు: హిమాయత్ సాగర్ నుంచి నీటి దోపిడీకి పాల్పడుతున్న వారిపై రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్టు వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్జలాశయాల నుంచి పైపులు, బోర్లు వేసి నీటిని దొంగిలిస్తున్న తీరుపై శనివారం వీ6 వెలుగులో ‘జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు’ పేరిట కథనం పబ్లిష్ అయ్యింది.
దీనికి వాటర్‌బోర్డు అధికారులు స్పందించారు. హిమాయత్ సాగర్ సమీపంలోని ఎఫ్‌టీఎల్ నంబర్లు 33, 34 పరిధిలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా ఏర్పాటు చేసిన రెండు బోర్‌వెల్స్, నీటి సరఫరా వ్యాపారానికి వినియోగిస్తున్న నిల్వ ట్యాంక్‌ను గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బుచ్చిబాబుపై రాజేంద్రనగర్ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
