ఢిల్లీలో నుపుర్ శర్మపై కేసు నమోదు.. 

ఢిల్లీలో నుపుర్ శర్మపై కేసు నమోదు.. 

ఇటీవల బీజేపీ బహిష్కృత నేతలు నవీన్ కుమార్ జిందాల్, నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీరు చేసిన వ్యాఖ్యలు మత విద్వేశాలను రెచ్చకొట్టేలా ఉన్నాయని.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి,మతపరమైన ఘర్షణలకు తావిచ్చేలా ఉన్నాయంటూ అభియోగాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నవీన్ కుమార్, నుపుర్ శర్మలపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు వివిధ మతాలకు సంబంధించిన మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నుపుర్ శర్మ,నవీన్ కుమార్ జిందాల్ తోపాటు షదాబ్ చౌహాన్,టీవీ జర్నలీస్టు సబా నఖ్వి,మౌలానా ముఫ్తి నదీమ్,అద్దుర్ రెహమాన్,గులామ్ అన్సారీ,అనిల్ కుమార్ మీనా,పూజా షకున్ ల పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారాలు,అబద్దపు సమాచారాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసులో సోషల్ మీడియా సంస్థల పాత్రపైనా విచారణ చేపట్టనున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు మమ్మరం చేశామన్నారు.