హైదరాబాద్: మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో పాటు టాక్సిక్ చిత్ర యూనిట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్టేజిపై ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అదే సమయంలో తొక్కిసలాట కూడా జరగడంతో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
గాయపడిన విద్యార్థి భాను ఇచ్చిన ఫిర్యాదుతో.. ఈవెంట్ శ్రేయస్ మీడియా, మల్లారెడ్డి యజమాన్యం ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన భద్రతా లోపాలు, ఈవెంట్ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు బాధ్యులెవరు అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
