మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పలువురు వాలంటీర్లు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.