సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఓ హోటల్ వద్ద పేదలు, వృద్ధులకు జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నారని సదాశివపేట పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు పేట సీఐ వెంకటేశం పోలీసు బలగాలతో వెళ్లి జగ్గారెడ్డితో సహా అక్కడున్న వారందరిని పంపించారు. ఈ మేరకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉంటే జగ్గారెడ్డి సదాశివపేటకు వెళ్లి ఆ హోటల్లో టీ తాగే టైంలో అక్కడున్న పేదలు, వృద్ధులకు డబ్బులు పంచడం అలవాటేనని ఆయన అనుచరులు చెబుతున్నారు.
