
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ చీఫ్కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేఏ పాల్ కంపెనీలో నైట్ షిఫ్టులో పని చేస్తున్న ఓ యువతి.. తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఆధారాలను వారికి అందజేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ సందర్భంగా వారి వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షీ టీమ్స్ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.