హనుమకొండ‎లో కేటీఆర్‎పై కేసు నమోదు

హనుమకొండ‎లో కేటీఆర్‎పై కేసు నమోదు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎పై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా, మే 6న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు ఈ మేరకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత పరువుకు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కేటీఆర్ వ్యాఖలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు సుబేదారి పీఎస్‎లో కేటీఆర్‎పై కేసు నమోదు అయ్యింది.