V6 News

కుల వివక్ష వల్లే అభివృద్ధిలో వెనుకంజ

కుల వివక్ష వల్లే అభివృద్ధిలో వెనుకంజ

పంజాగుట్ట, వెలుగు: దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కుల వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని, ఈ వివక్ష కారణంగానే దేశం అభివృద్ధిలో వెనుకపడుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష కొనసాగుతున్న సమయంలోనే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన పోరాటాలు సాగించారని, నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆదివారం ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి.మురళీధర్ రావు అధ్యక్షతన ‘నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఇండియన్ కాన్​సిస్ట్యూషన్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రాబ్లమ్స్’ అంశంపై సెమినార్ నిర్వహించారు. 

అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ.. అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా తమ పోరాటాలు, నిరసనల్లో అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ కంటే ముందుగానే అంబేద్కర్ చేసిన ఉద్యమాలను గుర్తు చేశారు. ఆలిండియా ఎస్సీ జాతీయ కోఆర్డినేటర్ జె. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. తరతరాలుగా దేశంలో కుల రాజ్యాంగమే అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్ నిధులు కేటాయించినప్పటికీ అమలు విషయంలో మార్పులు జరుగుతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన కోటా ఫలాలు అందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను అసెంబ్లీ, మంత్రివర్గాల్లో నామమాత్రంగా ఉంచి అధికారాలు మాత్రం ముఖ్యమంత్రుల వద్దే కేంద్రీకృతం చేస్తున్నారని అన్నారు. అనంతరం అలేఖ్య చేసిన క్లాసికల్ నృత్యం అంబేద్కర్ స్పూర్తిని ప్రతిబింబిస్తూ సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఈ.వినోద్, చీఫ్ ఇంజినీర్ ఎ.వివేకానంద, ప్రొఫెసర్ పుట్టా వెంకటేశ్వర్లు, సీహెచ్. మల్లికార్జున్, పి.యాదగిరి, నాగేశ్, కీమానాయక్, ఆర్. చంద్రశేఖర్ పాల్గొన్నారు