- సర్కారు బడి పిల్లలకు..
- లైట్ బ్లూ షర్ట్, నేవీ బ్లూ ప్యాంట్
- స్కూల్ యూనిఫాం రంగు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ల యూనిఫాం రంగులు మారనున్నాయి. బాలుర షర్టులు, బాలికల టాప్స్ లైట్ బ్లూ, బాలుర ప్యాంట్లు, బాలికల చుడీదార్/స్కర్ట్ ముదురు నీలం రంగులో ఉండనున్నాయి.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల యూనిఫాం రంగులు, డిజైన్‌ను మారుస్తూ విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రంగులకు బదులుగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొత్త కలర్ కాంబినేషన్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ బడి పిల్లలు సరికొత్త 'లుక్'లో మెరవనున్నారు. కొత్త కలర్ కాంబినేషన్ ప్రకారం.. బాలుర షర్టులు, బాలికల టాప్స్ లైట్ బ్లూ (లేత నీలం) రంగులో ఉంటాయి. అలాగే బాలుర ప్యాంట్లు, బాలికల బాటమ్స్ (చూడీదార్/స్కర్ట్)తో పాటు బాలికల వెయిస్ట్ కోట్ నేవీ బ్లూ (ముదురు నీలం) రంగులో ఉండనున్నాయి.కొత్త యూనిఫాం డిజైన్, రంగులకు అనుగుణంగా దుస్తుల తయారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.
