
- చంచల్ గూడ జైల్ బ్యారక్ లో ఘటన
- తీవ్ర రక్త స్రావం..ఆస్పత్రికి తరలింపు
- అబద్ధమంటున్న సూపరింటెండెంట్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎస్ఐబీ మాజీ అధికారి రాధాకిషన్ రావు పిల్లి కాటు బారిన పడ్డట్టు తెలుస్తోంది. జైలులోని బ్యారెక్ లో ఉన్న ఆయనను పిల్లి కరిచిందని, తీవ్ర రక్త స్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారని వార్తలు వస్తున్నాయి.
దీనిపై జైలు సూపరింటెండెంట్ శివకుమార్ స్పందించారు. ఆ వార్తలు అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. ఆయన జైలులోనే క్షేమంగా ఉన్నారని చెప్పారు.