
ఇండియాలో పండగలు పబ్బాలు, ఏదైనా శుభకార్యాలలో స్వీట్స్ లేనిదే పని జరగదు. ఏ చిన్న మూమెంట్ అయినా నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ.. ముఖ్యంగా దీపావళి లాంటి పండగ సమయంలో స్వీట్స్ కి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీపావళికి క్రాకర్స్ బిజినెస్ తో పాటు స్వీట్స్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. అంత డిమాండ్ ఉంటుంది స్వీట్స్ కి దీపావళి టైంలో. ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున స్టాక్ రెడీగా పెట్టుకుంటారు వ్యాపారులు. అయితే కొంతమంది పండగ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని.. నాసిరకం స్వీట్స్ తయారు చేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
రాజస్థాన్ లో ఫాడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా రెండు వేల కిలోలకు పైగా కలుషితమైన మిల్క్ కేక్ ను పట్టుకున్నారు అధికారులు.రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఓ స్వీట్ షాపులో రెండు వేల కిలోలకు పైగా కలుషితమైన మిల్క్ కేక్‌ను నదిలో పడేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే.. కలుషితమైన స్వీట్స్ ని నదిలో పడేసి.. నదిని కలుషితం చేస్తున్నారని అధికారులపై మండిపడుతున్నారు నెటిజన్స్.
కల్తీ స్వీట్లతో నదిని కలుషితం చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు:
ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ స్వీట్స్ ని నదిలో పడేసే సమయంలో ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఫాలో అవలేదని మండిపడుతున్నారు నెటిజన్స్. కల్తీ సీట్స్ ని నదిలో పడేసి నీటిని కలుషితం చేస్తున్నారని.. ఇది చాలా ప్రమాదకరమని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ మిల్క్ కేక్ ను నదిలో పడేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎకో ఫ్రెండ్లి ప్రొసిజర్స్ ఉపయోగించి కాల్చడం లేదా కంపోస్టింగ్ వంటి పద్ధతుల్లో కల్తీ స్వీట్స్ ని డిస్పోజ్ చేయాలని అంటున్నారు.